ప్రాంతీయ పార్టీలో ‘నెంబర్ టూ’ అనే పొజిషన్ చాలా చాలా కీలకమైనది.! కానీ, ఆ స్థానాన్ని ఎవరికీ ఇచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా వుండవు.! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తీసుకుంటే, ఆ పార్టీలో నెంబర్ టూ మాత్రమే కాదు, నెంబర్ నైన్ కూడా వుండదు.!
ఒకటి నుంచి పది వరకూ.. వైసీపీలో అన్నీ కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఆ తర్వాతే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తదితరులు.! టీడీపీని తీసుకుంటే, అధినేత చంద్రబాబు తర్వాత అన్నీ తానే అయి చూసుకుంటారు నారా లోకేష్. తండ్రీ కొడుకులు గనుక.. ‘నెంబర్ వన్, నెంబర్ టూ’ అన్న ప్రస్తావన వుండదు.
ఆ తర్వాతి స్థానం ఎవరిది.? అంటే, ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణది అయితే కాదు.! ఇలాగే వుంటాయ్ ప్రాంతీయ పార్టీల రాజకీయాలు. మరి, జనసేన పార్టీ పరిస్థితేంటి.? పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా, అక్కడ నాదెండ్ల మనోహర్ కనిపిస్తారు. ఇదో వింత పరిస్థితి.
పార్టీలో నాదెండ్ల మనోహర్ కీలక నేత కావొచ్చుగాక. పవన్ కళ్యాణ్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. రెండు పడవల ప్రయాణం చేస్తుండొచ్చగాక. కానీ, అన్ని చోట్లా నాదెండ్ల మనోహర్ ఎందుకు పవన్ కళ్యాణ్ వెనుక.?
పార్టీలో నాగబాబుకి పవన్ కళ్యాణ్ కీలక పదవి ఇచ్చారు. అయినాగానీ, నాదెండ్ల మనోహరే ఎక్కువగా పవన్ కళ్యాణ్ వెనకాల కనిపిస్తారు. వెనకాల కాదు, పవన్ కళ్యాణ్‌తో కలిసి కనిపిస్తారనడం సబబేమో.! సో, నెంబర్ టూ పొజిషన్ నాదెండ్ల మనోహర్‌దే.!
అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్నీ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారట.! నాదెండ్ల మనోహర్ అంటే, ‘వెన్నుపోటు వీరుడు’ నాదెండ్ల భాస్కర్ రావు తనయుడే.! అదే జనసేనలో చాలామంది భయం. కానీ, పవన్ కళ్యాణ్ చాలా చాలా బలంగా నమ్ముతున్నారు నాదెండ్ల మనోహర్‌ని.