మోదీ టార్గెట్ చేయడంతో చంద్రబాబుకు టెన్షన్.. వైసీపీకి మేలు జరుగుతుందా?

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమనే సంగతి తెలిసిందే. వయస్సు పెరుగుతున్నా కొడుకును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు తనే సీఎం అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనున్నారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలనే తమ ప్రభుత్వం కూడా అమలు చేయనుందని చంద్రబాబు చెప్పనున్నారని తెలుస్తోంది.

అయితే మోదీ టార్గెట్ చేయడంతో చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. మోదీ ఒకసారి నమ్మకం కోల్పోతే ఆ వ్యక్తిని జీవితంలో నమ్మరు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ విమర్శల ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి కారణమైంది. పవన్ సహాయంతో మోదీతో స్నేహం చేద్దామని చంద్రబాబు భావించగా చంద్రబాబుకు దూరంగా ఉండాలని మోదీ పవన్ కు సూచనలు చేశారని తెలుస్తోంది.

మోదీ సూచనలతో పవన్ సైతం చంద్రబాబుకు ఏ విధంగా సపోర్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మోదీ మాట కాదని పవన్ చంద్రబాబుతో చెయ్యి కలిపితే భవిష్యత్తులో మోదీ పవన్ ను కూడా దూరం పెట్టే అవకాశం ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా బీజేపీకి ఎలాంటి నష్టం లేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే మరో పార్టీ నుండి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమస్యలను పవన్ కళ్యాణ్ ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను త్వరలో ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి.