కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో ప్రజల ప్రశంసలు అందుకున్న పథకంగా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ పేరు తెచ్చుకుంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతుండగా బాల్య వివాహాలను అరికట్టాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ లో లేదా బ్యాంక్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆడపిల్ల పుట్టినరోజు నుంచి పదేళ్ల లోపు పోస్టాఫీస్ లో లేద బ్యాంక్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కనీసం 1000 రూపాయల డిపాజిట్ తో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జమ చేసిన డబ్బుపై 9.1 శాతం వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే మొత్తానికి ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుందని తెలుస్తోంది. ఏడాదికి గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ స్కీమ్ లో అకౌంట్ 21 సంవత్సరాల వరకు యాక్టివ్ గా ఉంటుంది. అమ్మాయిల వయస్సు 18 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పేద ప్రజలకు ఈ స్కీమ్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రజలకు ఈ స్కీమ్ ద్వారా ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అనుకునే తల్లీదండ్రులకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలగనుంది. మోదీ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది నష్టపోతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.