ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య సత్సంబంధాలు గత కొన్నేళ్లుగా లేవనే సంగతి తెలిసిందే. బీజేపీ వైసీపీ మధ్య పూర్తిస్థాయిలో కాకపోయినా ఈ రెండు పార్టీలు అవసరాలకు అనుగుణంగా సహాయసహకారాలు అందించుకుంటున్నాయి. అయితే జగన్, పవన్ లకు ప్రాధాన్యత ఇచ్చిన మోదీ చంద్రబాబుకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. చంద్రబాబు మోదీ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
చంద్రబాబు తాను డైరెక్ట్ గా మోదీని కలిసే అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ ద్వారా పనులు చక్కబెట్టాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబుతో ఉండటం ద్వారా మోదీ దగ్గర పవన్ విలువ సైతం అంతకంతకూ తగ్గుతోంది. ఒక్కసారి తనను మోసం చేసినా మోదీ సహించరనే సంగతి తెలిసిందే. నమ్మకంగా ఉండే వాళ్లకు మాత్రమే మోదీ దగ్గర విలువ ఉంటుంది. వాస్తవానికి మోదీ చంద్రబాబు, పవన్ లకు చాలా అవకాశాలను ఇక్ఛారు.
అయితే చంద్రబాబు, పవన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విషయంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారు. బీజేపీతో పొత్తు ద్వారా ఆర్థికంగా సమస్యలు రాకుండా ఉంటుందని పవన్, చంద్రబాబు భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది. వైసీపీకి ఇచ్చిన స్థాయిలో కూడా తమ పార్టీకి ప్రాధాన్యత దక్కకపోవడం పవన్, చంద్రబాబులను వేర్వేరుగా చాలా హర్ట్ చేసిందని సమాచారం అందుతోంది.
పవన్ కళ్యాణ్ పై తాజాగా కేసు నమోదు కావడం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. పవన్ కొత్త ప్రాజెక్ట్ లు కూడా ఆగిపోయాయని సినిమాల ద్వారా ఆయనకు వచ్చే ఆదాయం కూడా పెద్దగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి వస్తున్న ఫండ్స్ కూడా తక్కువే కావడంతో పవన్ కళ్యాణ్ పార్టీపై ప్రభావం పడుతోంది.