ఓ మహిళ కంట్లో చేరిన నులి పురుగును వైద్యులు శస్త్రచికిత్సతో విజయవంతంగా తీశారు. పెందుర్తికి చెందిన భారతికి కంట్లో నొప్పి రావడంతో విశాఖలోనే శంకర్ ఫౌండేషన్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుంది. పరీక్షించిన వైద్యులు ఆమె కంట్లో నులి పురుగు ఉన్నట్టు గుర్తించారు. దీనిని సిటి స్కాన్ తీసి పరీక్షించగా నులి పురుగు కన్ను గుడ్డు దగ్గర ఉన్నట్టు గుర్తించారు.
ఆపరేషన్ చేద్దామనుకునే లోపు పురుగు కనపడకుండా మాయమైంది. మళ్లీ మహిళకు నొప్పి రావడంతో ఆమె వెంటనే వైద్యులకు చెప్పారు.దీంతో డాక్టర్ నజరిన్ ఆధ్వర్యంలో ఆమెకు శస్త్రచికిత్స చేసి నులి పురుగును బయటకు తీశారు. పురుగు గుడ్లు కన్నులో ఉంటాయన్న అనుమానంతో అవి ఇన్ఫెక్షన్ కాకుండా మందులు ఇచ్చామని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులను పలువురు అభినందించారు.
ఆపరేషన్ చేసిన వీడియో కింద ఉంది చూడండి.
