వైసీపీ వల్ల నష్టపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇంకో పార్టీ ఛాన్స్ ఇవ్వదా?

ycp and bjp politics in ap

వైసీపీలో చాలామంది నేతలు మీడియా ముందుకు వస్తే హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు శృతి మించుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా వైసీపీ నేతలు మాత్రం విమర్శల విషయంలో అస్సలు తగ్గడం లేదు. ఇతర పార్టీల నేతలను విమర్శించడం ద్వారా జగన్ దృష్టిలో పడవచ్చని చాలామంది నేతలు భావిస్తున్నారు. అయితే వాస్తవాలు మాత్రం మరోలా ఉన్నాయి.

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇతర పార్టీల నేతల అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నాయి. వైజాగ్ లో వైసీపీ నేతలపై జరిగిన దాడుల వెనుక అసలు కారణం ఇదేనని సమాచారం అందుతోంది. వైసీపీ యువనేతలు వైసీపీలో టికెట్ దక్కకపోతే రాబోయే రోజుల్లో చేసిన విమర్శల వల్ల ఇతర పార్టీలలో చేరే అవకాశం కూడా ఉండదని చెప్పవచ్చు. వైసీపీ హైకమాండ్ చెప్పినట్టు చేస్తే పలువురు నేతల పొలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

వైసీపీ గొప్ప పార్టీనే అయినప్పటికీ పాలనానుభవం లేకపోవడం ఆ పార్టీ పాలిట శాపమవుతోంది. వైసీపీకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కొంతమంది కేసుల్లో చిక్కుకుని జైలుకే పరిమితమైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు ఒక విధంగా బలి పశువులు అవుతున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ నేతలు ఈ విషయాలను గమనించని పక్షంలో తర్వాత రోజుల్లో బాధ పడే ఛాన్స్ అయితే ఉంది.

వైసీపీకి వరుసగా కోర్టులలో సైతం ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2024లో వైసీపీ ఆధికారంలోకి రాకపోతే మాత్రం కొంతమంది నేతలు అటు పొలిటికల్ గా ఇటు ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ అయితే ఉంది. జగన్ సైతం విమర్శల విషయంలో హద్దులు దాటుతున్న నేతలకు తగిన సూచనలు చేస్తే మంచిదని చెప్పవచ్చు.