మంత్రి కొడాలి నాని మీడియా తో మాట్లాడొచ్చు .. .కానీ కండీషన్స్ అప్లై !

Social media users angry over Kodali Nani comments

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు.. ప్రభుత్వంలోని మంత్రులు, సలహాదారులకు మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ అంశంపై మీడియాతో మాట్లాడుతూ ఎస్ఈసీపై, ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. దీనిపై మంత్రి కొడాలి నాని కోర్టుకు వెళ్లగా విచారణ జరిపిన కోర్టు.. గురువారం కీలక ఆదేశాలిచ్చింది.

SEC vs Kodali Nani: మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట...కానీ కండీషన్స్ అప్లై...

మంత్రికి ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కొడాలి నాని మీడీయాతో మాట్లాడొచ్చని కొన్ని షరతులు కూడా విధించింది. మీడియాతో అయితే మాట్లాడొచ్చుగానీ ఎస్ఈసీ గురించి గానీ, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి గానీ, ఎన్నికల ప్రక్రియపై గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈనెల 12న జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఈసీపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. అదే రోజు ఆయన వివరణ ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని అందులో పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు.