గుడివాడకు తెలిసినంత కూడా కేసీఆర్ కి తెలియదా?

టీఆరెస్స్ నుంచి బీఅరెస్స్ గా మారిన అనంతరం ఏపీలో చక్రాలు తిప్పేద్దామని ఫిక్సయిన కేసీఆర్ & కో లు… స్టీల్ ఫ్యాక్టరీపై ప్రేమ కురిపించడం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన దశలో చేపట్టిన కార్యక్రమాలను చేపట్టి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ను ఆపుతామని అనడం కాకుండా… బిడ్డింగ్ లో పాల్గొంటామని, తెలంగాణ ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తామని చెబుతున్నారు! దీంతో… ఈ తెలివితేటలతోనే రాష్ట్రాన్ని పాలిస్తూ… ఏపీలో పరిపాలనపై కామెంట్లు చేస్తున్నారా అంటూ ఫైరవుతున్నారు నెటిజన్లు.

విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అమ్మకానికి కేంద్రం ఇచ్చిన బిడ్డింగులో తెలంగాణా ప్రభుత్వం కూడా పాల్గొంటుందని గంభీరంగా ప్రకటించారు కేసీఆర్! సింగరేణి కాలరీస్ తరపున తెలంగాణా ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనబోతున్నట్లు కేటీఆర్ వాయిస్ వినిపించారు. అలా ప్రకటించటమే కాకుండా సింగరేణి కాలరీస్ కు చెందిన డైరెక్టర్లు, నిపుణుల బృందాన్ని విశాఖకు పంపించి… ఫ్యాక్టరీ ఉన్నతాధికారులతో మాట్లాడించారు. టెక్నికల్ అంశాలతో పాటు ఇతరత్రా నిర్వహణ విషయాలు, ఆర్థిక పరిస్ధితులను కూడా అడిగి తెలుసుకున్నారు.

అయితే… తెలంగాణ ప్రభుత్వానికి కానీ, సింగరేణి సంస్థలకు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో బిడ్ దాఖలు చేసే ఛాన్స్ లేదని.. సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ.. కేంద్రప్రభుత్వ నిబంధనలను తెలంగాణ ముఖ్యమంత్రికి, మంత్రులకు నేర్పించే ప్రయత్నం చేశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

అవును… “2022లో కేంద్రం జారీచేసిన మెమో ప్రకారం.. ఏదైనా ప్రభుత్వరంగ సంస్ధను కేంద్రం ప్రైవేటీకరించాలని అనుకుంటే.. దాన్ని అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు! అంటే… కేంద్రం అనుకుంటే అది అయ్యి తీరుతుంది! ఇక ప్రైవేటీకరణకు జారీచేసిన బిడ్ల దాఖలులో మెమో ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్ధలు, ప్రభుత్వ రంగ సంస్ధల్లో వాటాలున్న ఇతర సంస్ధలు ఏవీకూడా ఈ బిడ్లలో పాల్గొనే అర్హత లేదు!” అని మంత్రి అమర్నాథ్.. కేసీఆర్ కు షాకిచ్చారు.

అంటే… మంత్రి చెప్పిందాని ప్రకారం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి కొనుగోలుకు బిడ్లు దాఖలు చేసే అవకాశం సింగరేణి కాలరీస్ కు లేదన్నమాట. కారణం… సింగరేణి కాలరీస్ లో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వాటాలున్నాయి. ఈ నిబంధనను చూపించి సింగరేణి కాలరీస్ నుంచి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బిడ్డింగ్ వేసినా.. దాన్ని అనర్హతగా ప్రకటించే అవకాశముంది. సో… తెలంగాణా ప్రభుత్వం కూడా బిడ్డింగులో పాల్గొంటుంది, ఏపీ హక్కును కాపాడే ప్రయత్నం చేస్తుందని చెబుతూ ఏపీ ప్రజలను ఏమార్చడానికి ఈ హడావిడి సరిపోతుంది తప్ప… మరింకెందుకూ పనికిరాదన్నమాట!

దీంతో… ఈ మాత్రం తెలియకుండానే, ఏపీలో ఫస్ట్ టైం మంత్రి అయిన వ్యక్తికి తెలిసినంత కూడా తెలియకుండానే… రాష్ట్రాన్ని పాలించేస్తున్నారా? ఏపీ ప్రభుత్వ పాలనపై కామెంట్లు చేసేస్తున్నారా? ఏపీ జనాలను తెలంగాణ వచ్చి ఉండమంటున్నారా? అంటూ ఆన్ లైన్ లో ప్రశ్నల వర్షాలు విత్ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు!

కాగా… బిడ్లు దాఖలు చేయటానికి ఈనెల 15వ తేదీ ఆఖరుతేదీ.

Minister Gudivada Amarnath Straight Question to CM KCR over Visakha Steel Plant @SakshiTVLIVE