అదేంటీ, మెగాస్టార్ చిరంజీవిని ‘ఫైర్ బ్రాండ్’ కొడాలి నాని ప్రశంసించడమేంటి.? తానేమో, మంత్రి హోదాలో వుండి కూడా, చిరంజీవితో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి వుండి కూడా ఆయన్ని తూలనాడేస్తే.. కొడాలి నాని ఎలా చిరంజీవి పట్ల భక్తిని ప్రదర్శిస్తారు.?
వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి, సినీ నటి రోజా అంతర్మధనం ఇదేనట.! సినిమా నటుల రెమ్యునరేషన్ల విషయమై, రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, చిరంజీవి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
కొడాలి నాని కేవలం సూచనగానే పరిగణిస్తున్నారు. పైగా, ఆ సూచనని సానుకూలంగా స్వీకరిస్తున్నట్లూ కొడాలి నాని ప్రకటించేశారు. అయితే, చిరంజీవి వ్యాఖ్యల్ని సోషల్ మీడియా వేదికగా తప్పు పట్టిన విజయసాయిరెడ్డి కూడా, చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షల్ని ఒకింత ‘భక్తి’తోనే తెలిపారు.
కొడాలి నాని అయితే, చిరంజీవి అభిమానులు నిర్వహించిన ‘మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో’ పాల్గొనడం గమనార్హం. ఇదంతా, మంత్రి రోజాకి అస్సలు గిట్టడంలేదట. మంత్రి పదవి వచ్చాక, నేరుగా చిరంజీవిని కలిసి, ఆశీర్వాదం తీసుకున్న రోజా.. ఆ తర్వాత చిరంజీవిని ఎలా విమర్శించారో అందరికీ తెలిసిన విషయమే.
చిరంజీవితో అంత సన్నిహిత సంబంధాలున్నా, ప్రభుత్వం తరఫున అలాగే పార్టీ తరఫున చిరంజీవి మీద విమర్శలు చేశాననీ, తాను అన్నలా భావించే కొడాలి ఇలా ప్లేటు ఫిరాయించేశారనీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా వాపోతున్నారట.
ఇక, విజయసాయిరెడ్డి వ్యవహార శైలి కూడా వైసీపీలో చాలామందికి మింగుడుపడ్డంలేదు. గతంలో చిరంజీవికి బర్త్ డే విషెస్ సోషల్ మీడియా వేదికగా చెప్పిన వైఎస్ జగన్, ఈసారి లైట్ తీసుకోవడం.. వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.