మంగళగిరి అని కూడా సరిగా పలకలేక మొదట్లో మందలగిరి అని పలికిన నారా లోకేష్ తన సత్తా చాటేందుకే ఇక్కడ పోటీ చేస్తున్నట్లు చెప్పటం నిజంగా పెద్ద జోకే. ప్రతిరోజు టిడిపికి జాకీలేసే ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం తరపున పోయిన ఎన్నికల్లో గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఐదేళ్ళపాటు నియోజకవర్గంలో సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదట. నియోజకవర్గంలో సమస్యలు బాగా పేరుకుపోయాయని లోకేషే చెప్పరు. ఎంఎల్ఏగా గెలిపించినందుకు ఎంతో కొంత న్యాయం చేయాలి కదా ? అంటూ ఆళ్ళని ఉద్దేశించి ఎద్దేవా చేయటమే విచిత్రంగా ఉంది.
మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయని తానే ఒప్పుకున్న లోకేష్ అధికారంలో తమ పార్టీనే ఉందన్న విషయాన్ని మాత్రం మరచిపోయినట్లున్నారు. రాజధాని ప్రాంతమున్న నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోయాయంటే అది తమ అసమర్ధతే అని స్వయంగా లోకేషే ఒప్పుకున్నట్లైంది.
పేదలకు సొంతిళ్ళు లేవట. తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందన్నారు. పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అవసరం ఉందట. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అంటే ఐదేళ్ళపాటు తమ ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోలేదని ఒప్పుకున్నట్లే కదా ? ప్రజాధరణ బట్టి తనకొచ్చే మెజారిటీ ఆధారపడుందని చెప్పటం గమనార్హం.
తాను ఇక్కడ ప్రచారం చేయటంతో అందరిలోను సంతోషం కనిపిస్తోందట. అందుకనే అందరూ వచ్చి తనను హత్తుకుని విరాళాలు కూడా ఇస్తున్నట్లు లోకేష్ పెద్ద జోక్ వేశారు. టిడిపి నేతల దగ్గర పంచటానికి సిద్ధంగా ఉన్న లక్షల రూపాయలు, ఏసిలు, వాషింగ్ మెషీన్లు పట్టుబడుతున్న విషయం ఎవరికీ తెలీదనుకున్నారో ఏమో ? 1985 నుండి ఇక్కడ ఎగరని టిడిపి జెండాను ఎగరేయటమే తన లక్ష్యంగా చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఎందుకంటే, 1985 నుండి ఇక్కడ టిడిపి అసలు పోటీ చేసిందే లేదు. పోటీ చేయకపోయినా టిడిపి జెండా ఎలా ఎగురుతుందో మందలగిరి లోకేషే చెప్పాలి.