గుడివాడలో కొడాలి నానికి తిరుగే లేదు.!

కొడాలి నాని.. పరిచయం అక్కర్లేని పేరిది.! రాష్ట్ర రాజకీయాల్లో ఆయనొక ‘బూతు’ సంచలనం. ‘ఆంజనేయస్వామి విగ్రహం చెయ్యి విరిగితే ఏమవుతుంది.? విరిగింది బొమ్మ తాలూకు చెయ్యే కదా.? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నీయమ్మ మొగుడు కట్టించాడా.?’ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే.!

గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నానికి తిరుగే లేదు.! ఆయన కాసినోలు, కోళ్ళ పందాలు నిర్వహిస్తారన్న విమర్శలున్నాయి. అక్కడి కుర్రకారుకి, కొంతమంది బలాదూర్ గాళ్ళకీ అవే కావాలట. ఆ విషయాన్ని కొడాలి నాని స్వయంగా చెప్పారు కూడా.! నిజానికి, గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది పెద్దగా కనిపించదు.

కానీ, గుడివాడ నియోజకవర్గం నుంచి మళ్ళీ కొడాలి నాని గెలుస్తారన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. ఈ నియోజకవర్గంపై వివిధ పార్టీలు నిర్వహించిన సర్వేల్లో, నియోజకవర్గ ప్రజలు కొడాలి నాని వైపే వున్నారని తేలుతోందిట. అదెలా సాధ్యం.? అంటే, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కొడాలి నాని అక్కడికి వెళ్ళి, సమస్యని పరిష్కరించేస్తారట.

నిజానికి, గుడివాడ అంటే ఒకప్పుడు టీడీపీకి పట్టున్న నియోజకవర్గం. ఎప్పుడైతే, కొడాలి నాని టీడీపీని వీడారో, ఆ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి. అక్కడ మళ్ళీ టీడీపీ పుంజుకోలేదు. ఈ నేపథ్యంలో, వచ్చే ఎన్నికల్లో గుడివాడపై టీడీపీ కూడా ఆశలు వదిలేసుకుంది.

జనసేన ఇక్కడ పెద్దగా తన ఉనికిని చాటుకోవడంలేదు. గట్టిగా ప్రయత్నిస్తే, గుడివాడలో కొడాలి నానికి జనసేన పోటీ ఇచ్చే అవకాశం వుంది. కానీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నా, జనసేన విజయావకాశాల్ని టీడీపీనే దెబ్బతీస్తుందిక్కడ.

వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి జనసేన పార్టీనే పోటీ చేసే అవకాశాలెక్కువ.! గట్టి పోటీ వుండొచ్చేమోగానీ, కొడాలి నాని గెలుపుకి ఏామత్రం ఢోకా లేదట.