Kethi Reddy: మా పార్టీ బతుకంతా అంతే… సొంత పార్టీ పై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Kethi Reddy: వైకాపా నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈయన కూటమి ప్రభుత్వం గురించి ప్రభుత్వ తీరు పట్ల ప్రశ్నల వర్షం కురిపిస్తూ చేసే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మవరం ఎమ్మెల్యేగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల అవసరాలు అన్నింటిని అప్పటికప్పుడు తీరుస్తూ ప్రజా నాయకుడుగా ఉన్నటువంటి కేతి రెడ్డి ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలుస్తారని అందరూ భావించారు.

ఇక ధర్మవరం నియోజకవర్గంలో ఊహించని విధంగా బిజెపి అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల పోటీలో దిగి కేతిరెడ్డి పైనే విజయం సాధించారు దీంతో కేతిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈ ఎన్నికలలో ఏదో కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన కూటమి ప్రభుత్వం ఆదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి పేరును బయటకు తీసుకురావడం గురించి ఒక వీడియో విడుదల చేశారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలోనూ అలాగే మీడియా వార్తలలో చేసే తప్పుడు ప్రచారాలపై మండిపడింది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకు రాలేదని తప్పుడు రాతలను వారు అనుకూల మీడియా ద్వారా చెప్పించారు.అదే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల పేరుతో ఆదాని నుంచి రెండు వేల కోట్ల వరకు లంచం తీసుకున్నారని అదే పేపర్లో తప్పుడు రాతలు రాస్తున్నారు అంటూ మండిపడ్డారు.

ఇదే కనుక నిజమైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన తీసుకున్న లంచం గురించి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు నాయుడు కోరలేదు అంటూ కేతిరెడ్డి ప్రశ్నించారు. ఇలా మేము ఏ తప్పు చేయకపోయినా కూటమి నేతలు గతంలోనూ ఇప్పుడు కూడా మాపై బురద చల్లుతూనే ఉన్నారు. ఇక మేము ఆ బురదను శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతిసారి ఏర్పడుతుందని మా పార్టీ బతుకంతా మాపై ఏర్పడిన నిందలు నిజం కాదని నిరూపించుకోవడానికి సరిపోతుందని తెలిపారు. మా పార్టీ గురించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిందలు మోపటమేనని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పట్ల ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మా పార్టీ బ్రతుకంతా అదే : Kethireddy Sensational Comments On YCP Party & YS Jagan @TtimesNews