మోదీపై కేసీఆర్ విమర్శలు భలే ఉన్నాయిగా.. ఆ ప్రశ్నలకు జవాబుందా?

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనాలని కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు వచ్చారని కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు జాతి గౌరవాన్ని కాపాడుకున్నారని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోరని ఎమ్మెల్యేలు ప్రూవ్ చేశారని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మోదీగారు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ కామెంట్లు చేశారు.

అయితే కేసీఆర్ విమర్శల గురించి నెటిజన్ల నుంచి కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు బీజేపీకి చెందిన వాళ్లేనని ప్రూవ్ చేయడానికి ఆధారాలు ఏమున్నాయని నెటిజన్ల నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ, అమిత్ షా తప్పు చేసినట్టు ఉన్న ఆధారాలు ఏంటని మరి కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ఎందుకు ప్రయత్నిస్తుందని మరి కొందరు చెబుతున్నారు.

ఇదే సమయంలో మరి కొందరు సందేహాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్లాన్ కేసీఆర్ వేసిన ప్లాన్ కాదని ఎలా నమ్మాలని వాళ్లు అడుగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ బీజేపీ పరువు తీయాలని ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఉండవచ్చని మరి కొందరు చెబుతున్నారు. ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఎందుకు మాట్లాడించడం లేదని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ ప్రశ్నలకు జవాబులు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. కేసీఆర్ సర్కార్ ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వృథానే అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమిపాలైతే మాత్రం కేసీఆర్ సర్కార్ తర్వాత ఏం చేసినా ఫలితం ఉండదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.