చంద్రబాబు చేసిన తప్పే కేసీఆర్ చేస్తున్నారా.. ఆ నేతలు అవసరమా?

chandrababu kcr telugu rajyam

మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి టీ.ఆర్.ఎస్ పార్టీకి చాలామంది నేతలు క్యూ కడుతున్నారు. అయితే కేసీఆర్ నుంచి హామీ లభిస్తుండటం వల్లే నేతలు పార్టీ మార్చడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒక ఉపఎన్నిక కోసం ఇంతమంది నేతలను చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లను చేర్చుకున్న కేసీఆర్ రాపోలు ఆనంద‌భాస్క‌ర్ ను త్వరలో చేర్చుకోనున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఇదే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన సంగతి తెలీసిందే. అయితే ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా పొలిటికల్ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం గమనార్హం.

ఈ విధంగా చేయడం వల్ల తాత్కాలికంగా బెనిఫిట్ పొందినా దీర్ఘకాలంలో భారీ స్థాయిలో నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు చేసిన తప్పే కేసీఆర్ కూడా రిపీట్ చేస్తున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. డబ్బు కోసం పార్టీ మార్చిన నేతలు భవిష్యత్తులో మరో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరే ఛాన్స్ అయితే ఉంది.

కేసీఆర్ ఇంత కష్టపడినా మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ గెలిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. టీ.ఆర్.ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మునుగోడులో గెలవడం తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మునుగోడు ఓటర్ల మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.