ఏపీలో జనసేన తెలంగాణలో బీఆర్ఎస్.. కేసీఆర్ కింగ్ మేకర్ అవుతారా?

2024 ఎన్నికలకు 19 నెలల సమయం మాత్రమే ఉండగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే యాక్టివ్ అయ్యాయి. ఏపీలో 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. అయితే హంగ్ ఏర్పడితే మాత్రం కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని కేసీఆర్ డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

వాస్తవానికి కేసీఆర్ 2029లో కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. అయితే ఇప్పటినుంచి శ్రమిస్తే మాత్రమే అప్పటికి అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుందని కేసీఆర్ అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం వీలైనన్ని ఎక్కువ ఎంపీ స్థానాలలో పార్టీ విజయం సాధించేలా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకోవడానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇప్పటికే కేసీఆర్ సౌత్ ఇండియాలోని చిన్నాచితకా పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో జనసేన 2014 ఎన్నికల్లో ఏ విధంగా కింగ్ మేకర్ అయిందో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని డిసైడ్ చేయడంలో బీ.ఆర్.ఎస్ అదే విధంగా కింగ్ మేకర్ కావాలని కేసీఆర్ అనుకుంటున్నారు.

మరోవైపు బీ.ఆర్.ఎస్ వల్ల ఏపీలో నష్టపోయే పార్టీ ఏదనే ప్రశ్నకు టీడీపీ పేరు సమాధానంగా వినిపిస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ కలిసే అవకాశం దాదాపుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంట్రీ వల్ల టీడీపీ, జనసేన పార్టీలకు భారీ మొత్తంలో నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ విషయంలో రాబోయే రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతాయో చూడాల్సి ఉంది.