జైలులో చంద్రబాబు… దోమలపై కేసీఆర్ కామెంట్లు వైరల్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమలు బాగా కుడుతున్నాయని, వాటితో కుట్టించి డెంగ్యూ రప్పించి, తద్వారా ఆయన ప్రాణానికి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆయన కుమారుడు లోకేష్ ఆరోపిస్తున్నారు.

ఇందులో భాగంగా ఒక ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబుని దోమలతో కుట్టించి ప్రాణహాని తలపెట్టబోతున్నారని, జైల్లో బాబు ప్రాణాల బాధ్యత జగన్ ది అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఇష్యూని టెకప్ చేసిన టీడీపీ సోషల్ మీడియా ఫుల్ వైరల్ చేస్తుంది. ఈ సమయంలో వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దోమతెరలు, ఏసీలు అరేంజ్ చేద్దామని ఎద్దేవా చేస్తున్నారు.

ఈ సమయంలో దోమల గురించి కేసీఆర్ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇందులో భాగంగా దోమలకు మంత్రి, సర్పంచ్, ఎమ్మెల్యే అనే తారతమ్యాలు ఏమీ ఉండవని.. దోమ గొప్ప సోషలిస్టు అని.. అది కుడితే చలి జ్వరం వచ్చి మూలన పడతామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సందర్భంగా ఆ వీడియోలో… “దోమ… చెత్త ఉంటే దోమ ఊంటాది. దోమ ఎమ్మెల్యేని కూడా కుడతాది.. మంత్రిని కుడతది.. ముఖ్యమంత్రిని కూడా కుడతది.. దోమకేమీ అడ్డం లేదు కదా.. ఎవరు ఎదురుంగా వస్తే వాళ్లని కుడతాది. అది మంచి సోషలిస్ట్ దోమ. దానికి ఏమీ తారతమ్యం లేదు.. ఈయన మంత్రా కాదా.. ఈయన ఈ ఊరి సర్పంచా కాదా.. అని చూసి కుడతాదా దోమ..? దానికి ఏమి తెలుసు..? కుట్టిందంటే ఏ మలేరియానో, మెదడువాపు వ్యాదో, ఏ చలిజ్వరమో పుడతది.. పోయి ఏ దవాఖానలోనో పడ్తాం” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. జైల్లో ఉన్నది మాజీ ముఖ్యమంత్రా, జేబు దొంగా అనే తేడాలు దోమకు ఉండవని, ఆ విషయం తెలుసుకోలేక పోవడం వారి తప్పిదం అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Telangana CM KCR: Mosquito Is A Great Socialist | Power Punch | NTV