ఏపీలోనూ అచ్చొచ్చిన”చీటింగ్” నే నమ్ముకున్న కేసీఆర్!

నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో… “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడే తొలి ముఖ్యమంత్రి” అని ప్రకటించారు కేసీఆర్. ఈ స్టేట్ మెంట్ అప్పట్లో సంచలనం. ఇలాంటి తెలంగాణ కదా మనం కోరుకున్నది – అసమానతలులేని స్వచ్చమైన తెలంగాణ రాబోతుంది అని ప్రజలు మరింత కసిగా పోరాడారు. ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. కానీ… కేసీఆర్ చీట్ చేశారు.. ఆయనే కుర్చీ ఎక్కారు!

దీంతో… నాడు కేసీఆర్ చేసిన మోసంపై సరైన స్థాయిలో ప్రశ్నించలేకపోయిన ఆ సమాజం.. మౌనాన్నే తమ బాషగా చేసుకుంది! కేసీఆర్ పబ్బం గడిచింది!! ఇది తెలంగాణలో కేసీఆర్ మార్కు చీటింగ్! అయితే.. ఇప్పుడు ఏపీలో కూడా దాదాపుగా ఇదే టైపు రాజకీయం చేయాలని ఫిక్స్ అయ్యారు కేసీఆర్. కాకపోతే సామాజికవర్గం పేరు మారిందంతే!!

అవును… ఇప్పుడు కేసీఆర్ చూపు ఆంధ్రప్రదేశ్ పై పడిందట. ఇందులో భాగంగా.. ఏపీలో కాపులకు ముఖ్యమంత్రి పదవి అనే స్టేట్ మెంట్ తో ముందుకు వెళ్లాలని నిర్ణయించారంట. ఏపీలో కాపు ముఖ్యమంత్రి సిద్ధాంతంతో వెళ్లే క్రమంలో ఇప్పటికే తోట చంద్రశేఖర్ ని ఇన్ ఛార్జ్ ని చేశారు కేసీఆర్!

ఈ క్రమంలో త్వరలో ఏపీలో బీఆరెస్స్ తొలి బహిరంగ సభ పెట్టాలని కేసీఆర్ బావిస్తున్నారంట. ఈ సభకోసం ఉత్తరాంధ్రలో ఉన్న వెలమ సామాజిక వర్గ ప్రజలను తరలించాలని స్థానిక కుల నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది! ఇదే క్రమంలో.. కాపులను మొబలైజ్ చేసే బాధ్యత.. తోట చంద్రశేఖర్ కు అప్పగించారంట కేసీఆర్! ఈ క్రమంలో… నెరవేర్చినా, నెరవేర్చక పోయినా సంచలన హామీలు ఇవ్వాలని, తద్వారా పబ్బం గడుపుకోవాలని పరితపించే కేసీఆర్… ఏపీలోని తొలిబహిరంగ సభలో… “కాపు ముఖ్యమంత్రి” నినాదాన్ని తెరపైకి తేనున్నారంట!

తద్వారా కాపు ఓటు బ్యాంకును సంపాదించొచ్చని ప్లాన్ చేశారంట. దీంతో… తెలంగాణలో దళిత ముఖ్యమంత్రి సంగతి హామీ విషయంలో తమరి మాటమీద నిలబడే తత్వం చూశాక కూడా… మెడకాయమీద తలకాయ ఉన్నవాడెవడైనా కేసీఆర్ మాట నమ్ముతారా”! అంటూ అప్పుడే ఆన్ లైన్ వేదికగా కేసీఆర్ పై కామెంట్లు మొదలైఓయాయి!