కర్మ ఎవరినీ వదిలిపెట్టదు పవన్.. ఏ1 అన్నందుకే ఇలాంటి ఫలితమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ షాకింగ్ తగిలింది. కొన్ని రోజుల క్రితం ఇష్టానుసారం కాన్వాయ్ పై వెళ్లిన పవన్ కు ఒక అనామక వ్యక్తి షాకిచ్చారు. వేర్వేరు సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు నమోదు కావడం గమనార్హం. నిజ జీవితంలో హీరో అనిపించుకోవాలని భావించిన పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగలడంతో పవన్ అభిమానులుఫీలవుతున్నారు. జగన్ ను ఏ1 అనే పవన్ కూడా ఏ1 అయ్యారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కర్మ ఎవరినీ వదిలిపెట్టడు పవన్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా జగన్ పై పవన్ కళ్యాణ్ తరచూ నెగిటివ్ కామెంట్లు చేస్తుండటం వల్ల పవన్ సైతం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన జనసైనికులు ఆ వీడియో వల్ల పవన్ పరువు పోవడానికి కారణమయ్యారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ప్రవర్తించిన విధంగా రియల్ లైఫ్ లో ప్రవర్తిస్తానంటే కుదరదని నెటిజన్ల నుంచి కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ కెరీర్ విషయంలో తప్పటడుగు పడకుండా పవన్ జాగ్రత్త పడాల్సి ఉంది. మోదీ పర్యటన సమయంలో పవన్ పై కేసు నమోదు కావడం అంటే వైసీపీ సర్కార్ టార్గెట్ చేసి పవన్ పై కేసు నమోదయ్యేలా చేసిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెనాలి మారిస్ పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ కు వరుస షాకులు ఇస్తుండటం గమనార్హం. పవన్ పై నమోదైన కేసు గురించి మోదీకి సమాచారం అందితే పోయేది పవన్ పరువేననే సంగతి తెలిసిందే.