AP: వైసీపీ గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయారు. ఈ క్రమంలోనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ వైసీపీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికార పక్షం మాత్రం 11 స్థానాలుకు మాత్రమే పరిమితం అయితే ప్రతిపక్ష హోదా రాదని అయినా ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది అంటూ మాట్లాడుతున్నారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నప్పటికీ అధికార ప్రభుత్వం మాత్రం ఇవ్వటానికి ఇష్టపడటం లేదు ఇలాంటి తరుణంలోనే వైకాపా ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ జగన్మహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని భయం కారణంగానే ఆయనకు హోదా ఇవ్వడం లేదని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తే జగన్ అడిగే ప్రశ్నలకు బాబు దగ్గర సమాధానం లేదు. ఇలా సమాధానం చెప్పుకోలేకనే ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటూ విమర్శలు కురిపిస్తున్నారని అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం ఉంటుందని… ప్రజల పక్షాన మాట్లాడే వీలు కలుగుతుందన్నారు.
ఇక కొంతమంది కూటమినేతలు జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు భయపడుతున్నారు అంటూ మాట్లాడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి వీచినప్పటికీ జగన్ పులివెందులలో 65 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు.సూపర్ సిక్స్ పథకాలపై రెఫరండంగా.. కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నించారు. కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు మాట్లాడితే సరిపోతుందా.. దమ్ముంటే కుప్పం, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల ఉప ఎన్నికలకు రావాలి అంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సవాల్ విసిరారు.