లోక్‌సభకు వెళ్ళే ప్రయత్నాల్లో కేఏ పాల్.!

కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్, 2024 ఎన్నికల్లో గెలిచి, లోక్ సభలో అడుగు పెట్టాలనుకుంటున్నారట.! ఆయన అనుకుంటే, ఇక తిరుగేముంది.? ఏమో, ప్రధాన మంత్రి అయిపోతాడేమో కూడా.!

ఆయన మాటలు అలాగే వుంటాయ్. ‘నా మిత్రుడు అమిత్ షా..’ అంటుంటారాయన.! జనసేన పార్టీని ప్రజా శాంతి పార్టీలో విలీనం చేసెయ్యాలంటారు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెబుతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కారణమూ తానేనని చెప్పుకుంటుంటారు.

అంతెందుకు.? మన్మోహన్ సింగ్ ప్రధాని అవడంలో తనదే కీలక పాత్ర అని చెప్పుకోవడమూ కిలారి ఆనంద్ పాల్‌కే చెల్లుతుంది. మొన్నటికి మొన్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పాల్, డిపాజిట్లుకూడా తెచ్చుకోలేకపోయిన సంగతి తెలిసిందే.

‘నిజానికి గెలిచింది నేనే.. కానీ, నన్ను మోసం చేశారు..’ అంటూ కేఏ పాల్ బుకాయించార్లెండి.! అసలు విషయాినకొస్తే, 2024 ఎన్నికల్లో ఎలాగైనా లోక్ సభకు వెళ్ళాలనే ఆలోచనతో కేఏ పాల్ వున్నారట. ఈ ఆలోచనతోనే, కేఏ పాల్, వైసీపీకి దగ్గరవుతున్నారన్నది తాజా ఖబర్.

అయితే, వైసీపీ ఆయన్ని ఎంటర్టైన్ చేస్తుందా.? చెయ్యదుగాక చెయ్యదు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విషయంలో కొంత సానుకూలంగా స్పందిస్తున్నారు కేఏ పాల్. అలా, వైఎస్ జగన్ మనసు గెలుచుకోవాలన్నది పాల్ వ్యూహమట.