ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కెఏ పాల్ విజయవాడలో మాట్లాడారు. త్వరలోనే విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన ఇంకేం మాట్లాడారో ఆయన మాటల్లోనే…
ఏపీలో పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకున్నాం. 175 నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్లను నియమించాం. చదువుకున్న వాళ్లు, అన్ని వర్గాల వారు కో ఆర్డినేటర్లుగా ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ అభివృద్ది కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 25 స్టెప్పులతో ప్లానింగ్ చేస్తున్నాం. మా ప్రణాళిక సక్సెస్ అయితే టిడిపి వైసీపిలకు పది సీట్లు కూడా రావు.ప్రజాశాంతి పార్టీ రాబోయే ఎన్నికల్లో 100 నియోజకవర్గాల్లో గెలువబోతుంది.
టిడిపి పాలన పట్ల రైతులు, నిరుద్యోగులు, కార్మికుల తో పాటు అంతా వ్యతిరేకతతో ఉన్నారు. నిలుచుంటే రెండు వేలు, కూర్చుంటే 5 వేలు ఇస్తే ఏ పార్టీకైనా జనం వస్తారు అలానే వైసిపి కి జనాలు వస్తున్నారు. త్వరలో కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించి అభ్యర్థులను ఖరారు చేస్తాం. నా ప్రియ శిష్యుడు చంద్రబాబు , జగన్ తో రాష్ట్రాభివృద్ధి పై బహిరంగ చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు, జగన్ డిబేట్ కు రాకపోతే వాళ్ళిచ్చిన హామీలు అబద్ధాలనుకోవాలి.
అమెరికాలో ప్రెసిడెంట్లు, గవర్నర్ లకు డిబెట్లు జరుగుతుంటాయి మరి ఏపి లో ఎందుకు జరుగవు. అవినీతి బయటపడుతుందని నేతలకు భయమా?జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు, పవన్ కూడా గెలవడు. పవన్‌కల్యాణ్ ఓడిపోకూడదని కోరుకుంటున్నా .. మాతో కలిసి ఓట్ల చీలిక లేకుండా చూడాలి. పొత్తుల విషయంపై ఆలోచిస్తున్నాం, కలిసి వస్తామంటే కాదనం. జనసేన తో కలవాలని అనుకుంటున్నా… వామపక్షాల పొత్తులతో పాటు మాతో కూడా పవన్ కలిస్తే బావుంటుంది. అని ఆయన అన్నారు.