జనసేనకు మద్దతివ్వనున్న జూనియర్ ఎన్టీయార్.?

తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం చేయాలని ఎవరూ కోరుకోవడంలేదు. ‘జూనియర్ ఎన్టీయార్‌ని టీడీపీలోకి ఆహ్వానిస్తారా.?’ అన్న ప్రశ్న వేయించుకున్నారుగానీ, సమాధానం చెప్పేటప్పుడు జూనియర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు నారా లోకేష్.

జూనియర్ ఎన్టీయార్ అంటే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌కి ఎంత ఈర్ష్య, ద్వేషం వున్నాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఇప్పటికైతే, జూనియర్ ఎన్టీయార్ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. కానీ, బీజేపీ నేతలు ఆయనతో టచ్‌లోనే వున్నారు.

నేరుగా ప్రత్యక్ష రాజకీయాల గురించి మాట్లాడకపోయినా, భారతీయ జనతా పార్టీకి మద్దతుగా జూనియర్ ఎన్టీయార్ నినదించబోతున్నాడనీ, ఎన్నికలకు ముందర బీజేపీ తరఫున ఆయా సంక్షేమ పథకాల కోసం ప్రచారకర్తగా మాట్లాడతాడనీ అంటున్నారు. మరోపక్క, జనసేన పార్టీ వైపు జూనియర్ ఎన్టీయార్ ఒకింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. ‘ఇప్పటికిప్పుడు ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చే అవసరం లేదు.

ఆయనకు ఆ తొందర లేదు. కాకపోతే, టీడీపీ ఆయన్ని అవమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పరోక్షంగా జనసేనకు మద్దతు తెలపొచ్చు..’ అని ఎన్టీయార్ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకవేళ ఈ విషయమై టీడీపీకి ఏమాత్రం ఉప్పందినా, బాలకృష్ణను రంగంలోకి దించేసి, యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ ఆయనతో చేయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చంద్రబాబు రాజకీయాలు అలాగే వుంటాయ్ మరి.! మొత్తమ్మీద, మరికొద్ది రోజుల్లోనే జూనియర్ ఎన్టీయార్ రాజకీయం విషయమై ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయన్నమాట.