Jogi Ramesh: జగన్ ను కలిసిన జోగి రమేష్.. పార్టీ మారడం పై వచ్చిన క్లారిటీ?

Jogi Ramesh: ఇటీవల వైకాపా నాయకుడు జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు కారణం నూజివీడులో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో జోగి రమేష్ కనిపించడమే ఇందుకు కారణమని చెప్పాలి. ఇలా జోగి రమేష్ టిడిపి మంత్రి పార్థసారధితో కలిసి కనిపించడంతో ఈయన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అందరూ భావించారు.

ఇలా వైకాపా మాజీ మంత్రిని తమ వెంట పెట్టుకొని ర్యాలీలలో పాల్గొనడంతో తెలుగుదేశం అధిష్టానం మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీషపై కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసిందే. అయితే ఈ విషయంపై మంత్రి పార్థసారథి మాట్లాడుతూ క్షమాపణలు కూడా కోరారు. ఇది పార్టీలకు అతీతంగా జరిగిన విగ్రహావిష్కరణ కావడంతో జోగి రమేష్ కూడా పాల్గొన్నారని ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని వివరణ ఇచ్చుకున్నారు.

ఈ విధంగా మంత్రి పార్థ సారధి సమక్షంలో జోగి రమేష్ కూడా ఈ వేడుకలో పాల్గొనడంతో మరోవైపు వైకాపా నాయకులు కూడా ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా జోగి రమేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఈయన పార్టీ మారడం పై క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఈయన ఎందుకు టిడిపి మంత్రులతో కలిసి కనిపించారనే విషయంపై వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ విగ్రహవిష్కరణ పార్టీలకు అతీతంగా జరగడంతోనే తాను వెళ్లానని అంతకుమించి మరే ఉద్దేశం లేదని జోగి రమేష్ వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తుంది ఇక వైకాపా పార్టీలో జోగి రమేష్ కు చాలా కీలక బాధ్యతలను గతంలో అప్పగించారు. ఇప్పుడు కూడా మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను ఈయనకే అప్ప చెప్పిన ఈయన మాత్రం పార్టీలో యాక్టివ్గా లేరని అందుకే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని పలువురు భావించారు. కానీ ఇటీవల ఈయన జగన్మోహన్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చుకున్నట్టు సమాచారం. దీంతో ఈయన పార్టీ మారే ఆలోచనలో లేరని క్లారిటీ వచ్చింది. జోగి రమేష్ ఇచ్చిన వివరణతో జగన్ సంతృప్తి చెందారా అలా సంతృప్తి చెంది ఉంటే పార్టీలో ఈయనకు మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్పాలి.