Jogi Ramesh: 2024 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా వైకాపా ఘోర పరాజయం అయింది కేవలం 11 స్థానాలలో మాత్రమే జగన్ గెలుపొందడంతో ఈయనకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఈ క్రమంలోనే ఎంతోమంది కీలక నేతలు వైకాపా నుంచి కూటమి ప్రభుత్వంలోకి వలసలు వెళ్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు వైకాపా నుంచి జనసేన టిడిపిలోకి వెళ్లారు. ఇక చాలామంది వైకాపా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు.
ఇలా వరుసగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యే లందరూ కూడా వైకాపా పార్టీకి గుడ్ బై చెబుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగులుతుంది అయితే త్వరలోనే మరొక కీలక నేత కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని స్పష్టం అవుతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో మంచిగా పని చేసిన జోగి రమేష్ త్వరలోనే వైకాపా పార్టీ విడబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఈయన తాజాగా టిడిపి మంత్రి పార్థసారధితో కలిసి కనిపించడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
తాజాగా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జోగి రమేశ్ హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పార్ధసారధితో కలిసి నూజివీడు పురపాలక పరిధిలో కలిసి ర్యాలీగా తిరగడం ఆసక్తికర అంశంగా మారింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
ఈ క్రమంలోనే జోగి రమేష్ కూడా త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ ఇవ్వబోతున్నారని ఈయన కూటమి ప్రభుత్వంలోకి వెళ్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అగ్రి గోల్డ్ భూమి వ్యవహారాలలో భాగంగా ఈయన కుమారుడిని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. అప్పటినుంచి జోగి రమేష్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.