జగన్ పుట్టినరోజున తమ్ముడు అవినాష్ రెడ్డి గిఫ్ట్ ఇదే…

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21 న జన్మించారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రాలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంసిద్ధమయ్యారు. అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కాగా జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నిరుద్యోగ యువత కోసం ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు.

డిసెంబర్ 21, శుక్రవారం నాడు అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్టు వైసీపీ నేతలు తెలియజేసారు. ఈ జాబ్ మేళాకు విద్యార్హత టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటిఐ,డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పిజి. ఉన్నవారు పాల్గొనవచ్చు. కడప చిన్న చౌక్ వై జంక్షన్ వద్దగల గురుకుల విద్యాపీఠ్, ఏవీఆర్ పాఠశాలలో జరగనున్నట్లు తెలియజేసారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి పిలుపునిచ్చారు.

జగన్ గురించి…

దివంగత ఉమ్మడి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ దంపతుల తనయుడు జగన్. కడప జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. కొంతకాలం పులివెందులలో, ఆ తర్వాత బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో, నిజాం కాలేజీలో చదువుకున్నారు. 1996 ఆగస్టు 28 న వైఎస్ భారతిని వివాహమాడారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తూ రాజకీయ అరంగేట్రం చేశారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు.

తండ్రి మరణానంతరం ఆయన రాష్ట్రమంతటా ఓదార్పుయాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన ఓదార్పు యాత్రను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం నిర్దేశించింది. ఈ విషయంలో రెజినా విబేధాల వలన ఆయన కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అనంతరం 2011 లో జరిగిన కడప ఉప ఎన్నికల్లో వైసీపీ అధిక మెజారిటీ సాధించింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 66 సీట్లు గెలుపొంది ప్రతిపక్షంలో ఉంది. ప్రత్యేకహోదా ప్రధాన లక్ష్యంగా జగన్ తన పోరాటం సాగించారు. ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా ఆయన నవంబర్ 6 , 2017 న ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతూ ఉంది.