JC Travels: ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా జెసి ట్రావెల్స్ ఒకప్పుడు ఎన్నో సేవలను అందించాయి అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెసి ట్రావెల్స్ పై కేసులు నమోదు కావడంతో సర్వీస్ లన్ని కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ జెసి ట్రావెల్స్ బస్సులను లారీలను కూడా నిలిపివేశారు అయితే తాజాగా అనంతపురంలో జేసీ ట్రావెల్స్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో…జేసీ దివాకర్ ట్రావెల్స్ కార్యాలయం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఒక బస్సులో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందాయి ఈ ఘటనలో భాగంగా బస్సు పూర్తిగా కాలిపోయింది అలాగే పక్కనే ఉన్నటువంటి మరో బస్సు కూడా పాక్షికంగా కాలిపోయింది.
ఇలా తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆపివేశారు. ఇలా జెసి ట్రావెల్స్ వద్ద పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడానికి గల కారణం ఏంటని పోలీసులు ఆరాధిస్తున్నారు. ఈ ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ప్రమాదాన్ని సృష్టించారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక కాలిపోయిన బస్సు సమీపంలో కరెంటు వైర్లు తెగిపడి ఉన్నాయి దీన్ని బట్టి చూస్తుంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో కూడా మంటలు వచ్చాయని స్పష్టం అవుతుంది. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకొని అన్ని కోణాలలో కూడా విచారణ చేపడుతున్నారు.