జనసేన వ్యూహం మారింది… ఇదిగో సాక్ష్యం!

కొన్నిసార్లు టీడీపీ మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా చూడటం కోసమే పుట్టినట్లుగా, కొన్నిసార్లు జగన్ ను తొక్కడానికే ఉద్భవించినట్లుగా. మరికొన్ని సార్లు ఏపీ రాజకీయ ఆటలో అరటిపండులా ఉండటానికే పురుడుపోసుకున్నట్లుగా అనిపించేది జనసేన.. అని రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపించేవి. పవన్ తీరు కూడా ఆ కామెంట్లకు బలం చేకూర్చేదిగానే ఉండేది. అయితే గత కొన్ని రోజులుగా జనసేనలో మార్పొచ్చినట్లు కనిపిస్తుంది.. తాజాగా ప్రూఫ్ కూడా దొరికింది!

“ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు బ్యాంకు చీలనివ్వను.. జగన్ సీఎం కాలేరు – రాసిపెట్టుకోండి – ఇది శాసనం.. చంద్రబాబు అనుభవానికి తన మద్దతు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికే చంద్రబాబుతో భేటీ.. ఏపీలో టీడీపీకి ఏమైనా ఇబ్బంది వస్తే, చంద్రబాబు కంటే ముందే స్పందిస్తాను..” ఇంతకాలం జనసేన అధినేత నుంచి వినిపించిన, కనిపించిన వ్యవహారం ఇది! కానీ… ఏమైదో ఏమో.. అనపర్తిలో చంద్రబాబుని పోలీసులు అడ్డుకున్నా – గన్నవరం టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేసినా.. పవన్ స్పందించలేదు!

ఏ చిన్న విషయానికైనా ట్విట్టర్ లో ఒక పీడీఎఫ్ రిలీజ్ చేసే పవన్… ఏపీలో ఇంత రచ్చ జరుగుతున్నా.. టీడీపీ తరుపున ఒక్కమాట కూడా మాట్లాడలేదు! మౌనంగానే తన వ్యూహాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు! అంతకంటే బలమైన సాక్ష్యం తాజాగా బొలిశెట్టి రూపంలో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా.. శభాష్ అనిపించే కామెంట్లు జనసైనికుల నుంచి వెలువడుతున్నాయి.

జనసేన పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ.. లేటెస్ట్ గా నారా లోకేష్ పాదయాత్ర మీద హాట్ కామెంట్ చేశారు. “లోకేష్ పాదయాత్ర చతికిలపడింది” అని డైరెక్టుగా విమర్శించారు. అక్కడితో ఆగారా… “ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఎత్తుగడలకు కాలం చెల్లింది” అంటూ బాబుకీ షాకిచ్చారు! దీంతో… ఇంతకాలానికి జనసేన స్పష్టమైన రాజకీయం చేయడం మొదలుపెట్టిందని అంటున్నారు విశ్లేషకులు!

అవును… జనసైనికుల దృష్టిలో జనసేనకు వైసీపీ – టీడీపీ.. రెండూ ప్రత్యర్ధులే! మూడవ పక్షంగా ఏపీ రాజకీయాల్లో ఉండేది జనసేన మాత్రమే! కానీ.. ఇంతకాలం జనసేనాని ఇలా ప్రవర్తించలేదు! కానీ… తాజా పరిణామల దృష్ట్యా బొలిశెట్టి చేసిన కామెంట్స్ పుణ్యమాని… పవన్ ఇండివిడ్యువల్ గానే రాబోతున్నారు.. రాణించబోతున్నారని కాలరెగరేస్తున్నారు జనసైనికులు!

ఏది ఏమైనా… పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి చెప్పిన మాటలు నిజంగా మారిన జనసేన వేనా లేక.. ఆయన వ్యక్తిగతమా అన్నది తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!!