జనసేనాని సినిమాటిక్ వ్యూహాత్మక మౌనం.!

సినిమా షూటింగుల్ని మధ్యలో ఆపేసుకుని, హైద్రాబాద్ నుంచి విజయవాడకు ఆ మధ్య పయానమై, ప్రత్యేక విమానంలో కుదరక.. రోడ్డు మార్గంలో వెళ్ళి హైడ్రామా క్రియేట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అదీ చంద్రబాబు కోసమేనంటూ ప్రచారం జరిగింది.

ఇంకోసారి, ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్ళి, చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయ్యారు జనసేన అధినేత. ఈసారి చంద్రబాబు కోసమే వెళ్ళారు. ఇందులో మార్పు లేదు. పైగా, టీడీపీతో పొత్తుని రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా జనసేనాని ఖరారు కూడా చేశారు.

Read More – ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ సినిమాకి ఆమెకోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట 

అప్పటినుంచి కింది స్థాయిలో జనసేన – టీడీపీ శ్రేణులు కలిసి పని చేస్తున్నాయి. అంటే, రోడ్లపై గుంతల సమస్యకు సంబంధించి మాత్రమే కాదు, చంద్రబాబు అరెస్టు తీరుపై మండిపడుతూ నిరసనలు చేయడం వరకూ కూడా.. అన్నీ కలిసే చేస్తున్నాయ్ టీడీపీ, జనసేన.

అయితే, జనసేనాని అనూహ్యంగా సైలెంటయ్యారు. పార్టీకి చెందిన కొందరు నేతల హడావిడి మినహా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కొత్తగా ఎలాంటి పొలిటికల్ మూమెంటూ లేదు. నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేశారు. పవన్ కళ్యాణ్, తన సినిమా షూటింగులు చేసుకుంటున్నారు.

2024 ఎన్నికలంటే ఎంతో దూరంలో లేవు. పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేసుకోవాలి. జనసేన లాంటి పార్టీలకి వున్న సమయం చాలా చాలా తక్కువ. అన్నట్టు, తెలంగాణలో జనసేన పార్టీ 30 మందికి పైగా అభ్యర్థుల్ని నిలబెడుతుందట. ఇదో ట్విస్టు.! ఈ విషయమ్మీద అయినా జనసేనాని గళం విప్పాలి కదా.? ప్చ్.. అంతా సినిమాటిక్ వ్యూహాత్మక మౌనమే.!

Read More – జగన్ కక్షకు దోమే ఆయుధం… స్కోప్ ఎంత ఉంది?