ఇండస్ట్రీ టాక్ : మెగాస్టార్ సినిమాకి ఆమెకోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట 

తెలుగు సినిమా దిగ్గజ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి తన ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రాక్ లోకి వచ్చేసారు. కాగా తన కెరీర్ 157వ సినిమాని అయితే దర్శకుడు బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా పట్ల తాను ఎగ్జైటింగ్ న్యూస్ ని కూడా రివీల్ చేసాడు.

ఈ సినిమాలో హీరో పై రొమాంటిక్ సీన్స్ కానీ హీరోయిన్ తో సీన్ లు కానీ చాలా తక్కవే ఉంటాయి అని క్లారిటీ ఇచ్చాడు. కాగా ఈ చిత్రంలో అయితే ఆల్రెడీ మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. కానీ సినిమా స్టార్టింగ్ లోనే మెగాస్టార్ సరసన అయితే మన టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లాక్ అయ్యింది అని రూమర్స్ వచ్చాయి.

మరి ఇప్పుడు అయితే అనుష్క కోసం మేకర్స్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ముగ్గురు హీరోయిన్స్ ఏమో కానీ అనుష్క పేరు అయితే ఇప్పుడు బాగా వినిపిస్తుంది. మరి దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రాన్ని భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో మళ్ళీ పాత చిరు చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో తెరకెక్కిస్తున్నామని కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ సినిమాని అయితే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కావచ్చు.