జనసైనికులకు కొత్త తలనొప్పి… గ్రామాల్లో పరిస్థితి ఇదే!

కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా జనసేన వారాహి యాత్ర పరిస్థితి ఉందనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీనికంతటికీ కారణం… పవన్ నిరాశ, నిసృహలతో నిండిపోయినట్లుగా ఉన్న మాటలు, విమర్శలు. ఇప్పుడు గ్రామాల్లో జనసైనికులకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టాయని అంటున్నారు.

సర్గిగ్గా గమనిస్తే… పవన్ కి స్పష్టత అతి తక్కువ.. శూన్యం అంటే బాగోదనుకోండి! పవన్ కు రాజకీయంగా నిలకడ మరీ తక్కువ… ఇక్కడ శూన్యం అన్నా పర్వాలేదు! అప్పటికప్పుడే పొత్తు మస్ట్ & షుడ్ అంటారు.. పొత్తు లేకపోతే వీరమరణంతో పోతాం అంటారు. మరోపక్క పొత్తు గురించి అప్పుడే చెప్పలేమని, ఒంటరిగా వెళ్లినా వెళ్తామన్నట్లుగా వ్యాఖ్యానిస్తుంటారు.

మరోపక్క తనకు ముఖ్యమంత్రి అయ్యేటంత సీన్ లేదని స్పష్టం చేస్తుంటారు.. మరోవైపు తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతుంటారు. ఇంకోవైపు తన సభలకు జనాల కొరత ఎప్పుడూ లేదంటారు.. కానీ తనకు ప్రజలు ఓట్లు మాత్రం వేయడం లేదని ఫీలవుతుంటారు. దీంతో ఈ విషయాల్లో ఉన్న తేడా గమనించిన జనసైనికులు తలలు పట్టుకుంటుంటే… విషయం గ్రహించలేని వారు మాత్రం ఈలలూ కేకలూ వేస్తుంటారు.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు.. ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దాడులు చేస్తానని చెబుతుంటారు. ఫలితంగా వాళ్లతో తలంటించుకుంటారు. ఫలితంగా మళ్లీ ఆ టాపిక్ ఎత్తరు! ఇదే సమయంలో ముద్రగడ లాంటి కాపు నేతలను సైతం విమర్శిస్తుంటారు.. వారు లేఖాస్త్రాలు సందిస్తుంటే.. కార్యకర్తలకు సైతం అందకుండా దాక్కుంటారు!

ఇప్పుడు తాజాగా వాలంటీర్లపై స్పందించారు. తీవ్ర విమర్శలు చేశారు. సభ్యసమాజం గురించి ఆలోచించే ఆలోచన చేయలేకపోయారు! చెప్పే విషయం వల్ల, చేసే విమర్శ వల్ల పార్టీకి వచ్చే మైలేజ్ ఎంత, తన మాటలకు జనాల్లో పెరిగే నమ్మకం ఎంత అని బేరీజు వేసుకునేటం జ్ఞానం పవన్ కు ఇంకా వచ్చినట్లు లేదు! ఫలితంగా… మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు.

తీరా రియాక్షన్ తీవ్రంగా వచ్చేసరికి… తన ఉద్దేశ్యం అది కాదు అన్నట్లుగా నాలుకమడత మాటలు మాట్లాడారు! తనకు భయం లేదు అని అంటూనే… నిత్యం ఆ విషయాన్ని రివర్స్ లో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఫలితంగా… గ్రామాల్లో జనసైనికులను ఇరకాటంలో పాడేస్తుంటారు.

తాజాగా ఒక గ్రామంలో… ఫీవర్ సర్వే కోసం జనసైనికుల ఇంటికి వెళ్లిన వాలంటీర్లు… మీ ఇంటికి రావొచ్చా.. ఈ ఇంట్లో మహిళలు ఉంటారేమో కదా పర్వాలేదా.. అని వెటకారం ఆడే పరిస్థితి కనిపించిందని తెలుస్తుంది. దీంతో.. ఆ కుటుంబంలోని మహిళలు, పెద్దలు సిగ్గుతో తలదించుకుని.. ఆ మాటలకూ మాకు ఏమిటమ్మ సంబంధం అని చెప్పుకున్నారంట. అతనికి రాజకీయాలు రావమ్మా… వదిలేయండి అని నిరాశతో కూడిన స్టేట్ మెంట్ ఇచ్చారని అంటున్నారు.

ఇక బయట తిరిగే జనసినికులకు కూడా తలనొప్పులు తప్పడం లేదని అంటున్నారు. ఇంటిలోనో, పక్కింటిలోనో, ఊరిలోనే ఎవరినైనా మహిళను బైక్ పై తీసుకుని షాపుకో, ఆస్పత్రికో వెళ్తుంటే… ఉమన్ ట్రాఫికింగ్ అని తాము అనుకోములే తమ్ముడూ అని కొంతమంది వాలంటీర్లు సెటైర్స్ వేస్తున్నారని సమాచారం. ఈ స్థాయిలో జనసైనికులకు పవన్ వల్ల టార్చర్ మొదలైందని చెబుతున్నారు!

అవన్నీ ఒకెత్తు అయితే… ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లుగా పనిచేస్తున్న జనసైనికులు అయితే మరింత ఇబ్బంది పడుతున్నారంట. నిన్న మొన్నటివరకూ మా ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చి, టీ తాగి వెళ్తుంటే మా వాడు, మనోడు, మా ఊరి అమ్మాయి అని అనుకునేవాళ్లమే కానీ… మీరు చేసే పనులు ఇవా అని వృద్ధులు ప్రశ్నిస్తుంటే… పవన్ కు ఎలాగూ లేదు… మీరు కూడా ఏమిటమ్మా అని తప్పించుకుపోతున్నారంట!

ఇక రాజకీయ సమస్యల విషయానికొస్తే… వాలంటీర్ల గురించి మాట్లాడాలనుకుంటే వాళ్ల జీతాల గురించి, పనితీరు గురించో మాట్లాడొచ్చు. లేకపోతే వలంటీర్ల వ్యవస్థలో లోపాలేంటో చెప్పి.. తానైతే ఎలా సరిచేస్తానో చెప్పుకోవచ్చు. అంతేకానీ వాలంటీర్లంతా మాఫియా కోసం పనిచేస్తున్నారని, ఒంటరి మహిళల వివరిలిస్తున్నారనటంతో… ఆ విషయాన్ని ఎలా సమర్ధించుకోవాలో జనసైనికుల బుర్రకు తట్టడం లేదంట… ఈ ఒక్క కామెంట్ రేపటి రోజున ఎలా కొంపముంచబోతోందనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు!!

ఇలా తన వ్యక్తిగత స్వార్ధ రాజకీయాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లడం కోసం అన్ని రకాలుగానూ పార్టీని ఇబ్బంది పెడుతూ, జనసైనికులను ఇరుకునపెడుతూ… తాను పతనమైపోతున్న విషయాలు పవన్ గ్రహించేనాటికి అంతా అయిపోతుందని… తాను మునిగిపోతూ పోతూ బాబును కూడా తనతో తీసుకెళ్లిపోతున్నారని పలువురు అభిప్రాయప్డుతున్నారని అంటున్నారు!

ఏది ఏమైనా… పవన్ లో బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని, సామాజిక సృహ పవన్ లో శూన్యం అని కామెంట్లు వినిపిస్తుండటం కొసమెరుపు!