ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ లో జగనన్న విదేశీ విద్యా దీవెన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్కీమ్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీలలో ఉన్నత ఉచిత విద్యను కల్పించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణ పేదలకు ఉచిత విద్య లభించనుంది.
టాప్ 100 వర్సిటీలలో చేరితే పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. టాప్ 101 నుంచి 200 వర్సిటీలలో చేరితే 50 లక్షల వరకు ప్రభుత్వం ఫీజును చెల్లిస్తుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ఆధారంగా వర్సిటీలను గుర్తించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం స్ప్రింగ్, ఫాల్ సెషన్ ప్రవేశాలు పొందిన వాళ్లు ఈ స్కాలర్ షిప్ కు అర్హత కలిగి ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎంబీబీఎస్, పీజీ, పీ.హెచ్.డీ స్థాయి కోర్సుల కోసం ఈ స్కీమ్ అమలవుతుండటం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ కలుగుతుంది. ఎనిమిది లక్షల రూపాయల కంటే వార్షికాదాయం తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందడానికి అర్హత కలిగి ఉంటారు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉండటంతో పాటు ఏపీలో నివాసం ఉండేవాళ్లు ఈ స్కీమ్ కు అర్హత కలిగి ఉంటారు. కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.
ఆన్ లైన్ లో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు jnanabhumi.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. నాలుగు విడతల్లో ఈ స్కాలర్ షిప్ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.