షరతులు ఉల్లంఘిస్తే చుక్కలే.. లోకేశ్ విషయంలో జగన్ ప్లాన్ ఇదేనా?

jagan (1)

ఎన్నో ట్విస్టుల నడుమ చివరకు లోకేశ్ పాదయాత్రకు అనుమతులు లభించాయనే సంగతి తెలిసిందే. 14 షరతులతో చిత్తురు ఎస్పీ లోకేశ్ పాదయాత్రకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ షరతులలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా లోకేశ్ కు చుక్కలేనని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. లోకేశ్ 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఏకంగా 400 రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది.

కుప్పం నుంచి పాదయాత్ర జరగనుండగా రోజుకు పది కిలోమీటర్ల చొప్పున ఈ పాదయాత్ర జరగనుంది. పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రజలకు, ఎమర్జెన్సీ సర్వీసులకు, వాహనదారులకు ఇబ్బంది కలగించకూడదని పోలీసులు సూచనలు చేశారు. ఈ పాదయాత్రపై వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేయాలో అన్ని విమర్శలు ఇప్పటికే చేశారు.

ఈ పాదయాత్ర వల్ల టీడీపీకి మేలు జరుగుతుందో లేక వైసీపీకి మేలు జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఈ పాదయాత్రకు ఏ విధంగా ఆదరణ ఉంటుందో చూడాల్సి ఉంది. 4000 కిలోమీటర్లు అంటే ఏపీలోని దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ అవుతాయి. వైఎస్సార్ తో ఈ పాదయాత్ర మొదలు కాగా ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్ర చేసినా వైఎస్సార్ స్థాయిలో ఆదరణ దక్కలేదు.

పోలీసులు పాదయాత్ర విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. కావాలని సమస్యలను సృష్టిస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందులు తప్పవు. లోకేశ్ ఇష్టనుసారం మాట్లాడితే మాత్రం వైసీపీకి బెనిఫిట్ కలుగుతుంది. లోకేశ్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ పాదయాత్రనా? లేక ఫెయిల్యూర్ పాదయాత్రనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. షరతులు ఉల్లంఘిస్తే చుక్కలు చూపించాలని సీఎం జగన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.