బాబుపై జగన్ పెట్టిన ఆ ఒక్క ట్వీట్ ఎంత ఘాటుగా ఉందో చూడండి.

చంద్రబాబుపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పుష్కరాలను రాజకీయాల కోసం వాడుకోవడం ఒక తప్పు అయితే, దాని ద్వారా ప్రచార లబ్ది పొందడానికి సినిమా తీయించుకోవాలి అనుకోవడం మరో తప్పు. పుష్కరాల పనుల్లో అవినీతికి పాల్పడి తప్పులుమీద తప్పులు చేశారు.

చివరకు చంద్రబాబుగారు చేసిన నిర్వాకం వల్ల 29 మంది చనిపోతే క్షమించమని దేవుడిని, ప్రజలని అడగాల్సిందిపోయి, తన చేతిలో ఉన్న కమిషన్ చేత తప్పుడు రిపోర్టు ఇప్పించుకున్నారు. భగవంతుడి దృష్టిలో, ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యారు. జగన్ ట్వీట్ మరియు ట్వీట్ తాలూకు ఫోటో కింద ఉన్నాయి చూడండి.

 

 

2015 గోదావరి పుష్కర ప్రచారాలకై చంద్రబాబు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ద్వారా ఒక షార్ట్ ఫిలిం తీయించారు. అందుకోసం ఆయన విఐపి ఘాట్ వద్ద కాకుండా సాధారణ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా పుష్కర ఆరంభ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇదంతా షూట్ చేసేవరకు చాలా ఆలస్యమైంది. రాత్రి నుండి తెల్లవారుఝామునే పుష్కర స్నానం చేయడానికి భక్తులు పడిగాపులు కాస్తున్నారు.

జనసంఖ్య కూడా తండోపతండాలుగా పెరిగింది. షూటింగ్ పూర్తయ్యి గేట్లు తెరిచేసరికి ఒక్కసారిగా జనం లోపలి వెళ్ళడానికి ప్రయత్నించారు. దీనితో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటలో 29 మంది భక్తులు మరణించగా, అనేకమంది గాయాలపాలయ్యారు.