వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన దాడికి సంబంధించి…జగన్ హై కోర్టును ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యం వలనే తనపై దాడి జరిగిందని పిటిషన్ దాఖలు చేసారు. తనపై జరిగిందని హత్యాయత్నమే ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే జగన్ పై జరిగిన దాడి గురించి వైవీ సుబ్బారెడ్డి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసారు. అంతకంటే ముందే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ రెండు పిటిషన్ల విచారణ వాయిదా
పడటంతో జగన్ స్వయంగా రిట్ పిటిషన్ వేశారు. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సిట్ విచారణ జరుపుతున్న సమయంలో ఆయన రిట్ పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై విశ్వాసం లేదని సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. తనపై జరిగిన దాడి కుట్ర పూరితంగా హత్యాయత్నమే అని, ఏపీ ప్రభుత్వ వైఫల్యం వలనే అని స్పష్టంగా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
సిబిఐ కాకపోయినా ప్రభుత్వానికి సంబంధించిన మరే దర్యాప్తు సంస్థతో అయినా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ పిటిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ, సీఎం, ఏపీ డీజీపీ, తెలంగాణ డీజీపీ, ఎయిర్పోర్ట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిట్ ఇంచార్జి అధికారి, కేంద్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీలను ప్రతివాదులుగా చేర్చారు. ప్రభుత్వం పోలీసులు కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా పేర్కొన్నారు.
కేసును రాజ్యాంగబద్దంగా కాకుండా…రాజకీయ కోణంలో పరిశీలిస్తున్నారని ఈ పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రతిపాదించారు. మంగళవారం హాస్పిటల్ ప్రెమిసెస్ లో నిందితుడు శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసాడు. నాకు ప్రాణహాని ఉంది, నేను ప్రజలతో మాట్లాడాలి, నా వెనక ఎవరు లేరు, నేనే ప్రజల కోసం ఇలా చేశా అని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆలస్యం అవుతున్న కొద్దీ సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని అనుమానంతో జగన్ సిబిఐ ఎంక్వైరీ కోరినట్టు తెలుస్తోంది. కాగా స్వచ్చంద సంస్థల ద్వారా విచారణ జరిపించాలని జగన్ కోరిన నేపథ్యంలో రేపు ఈ కేసుపై విచారణ జరగనుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు ఏవిధంగా ఉంటాయో వేచి చూడాలి. జగన్ వేసిన రిట్ పిటిషన్ పై స్పందించి హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలకు కేసును అప్పజెబుతుందా లేదా అని తేలాల్సి ఉంది. జగన్ ఈ తీసుకున్న ఈ నిర్ణయం టిడిపి మింగుడుపడని అంశం అని వైసీపీ శ్రేణులు అంటున్నారు.