ఏపీలో టీడీపీ, జనసేన కలిస్తే అద్భుతాలు జరిగిపోతాయని అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే ఒకసారి మోసపోయిన ఏపీ ప్రజలు మళ్లీమళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేరు. జగన్ సర్కార్ పాలనలో లక్షల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎవరికీ రూపాయి కూడా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా సర్టిఫికెట్లు మంజూరు కావడం జరిగింది.
రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెబుతున్న వాళ్ల సంఖ్య చాలా అంటే చాలా తక్కువగా ఉంది. అభివృద్ధి విషయంలో విమర్శలు ఉన్నప్పటికీ ఆ విమర్శలకు చెక్ పెట్టే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. జగన్ సర్కార్ పాలనలో ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గింది. ఉద్యోగులకు ఏవైనా సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం జగన్ సర్కార్ కృషి చేస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో పాలన మెరుగ్గా ఉంది.
మరో 30 ఏళ్లు జగన్ సర్కార్ కు అపజయం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. ప్రజలు సైతం జగనన్నకే ఓటేస్తాం అని చెబుతున్నారు. సెలబ్రిటీలు సైతం జగన్ సర్కార్ పాలనపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అన్ని పార్టీలు ఏకమైనా జగన్ ను ఓడించడం జరగదని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబును ప్రజలు నమ్మడం అసాధ్యమని చెప్పవచ్చు.
చంద్రబాబును నమ్మితే నిండా మునిగినట్టేనని కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నేతల్లో కూడా చంద్రబాబుపై అపనమ్మకం పెరిగిపోతుంది. బీజేపీని కాదని టీడీపీతో పొత్తు పెట్టుకునేంత ధైర్యం పవన్ కు లేదు. అదే సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదని కొంతమంది నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.