పెన్షన్ ను పెంచేసిన జగన్.. మాట తప్పనని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడుగా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రజల కోసం అమలు చేసే పథకాలన్నీ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కచ్చితంగా అమలు చేస్తారని పేరుంది. విడతల వారీగా పెన్షన్ ను పెంచుతున్న జగన్ 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెన్షన్ ను మళ్లీ పెంచేశారు. మాట తప్పనని జగన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారని నెటిజన్ల నుంచి పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఏపీ కేబినేట్ పెన్షన్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 62 లక్షల మంది బెనిఫిట్ పొందనున్నారు. ఇచ్చిన ప్రతి హామీని పక్కాగా అమలు చేసిన జగన్ సర్కార్ గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ప్రజల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు.

అదే సమయంలో జగన్ సర్కార్ అభివృద్ధి దిశగా కూడా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ తనకు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు. జగన్ పథకాలను అమలు చేస్తున్న తీరు బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలకు అదనంగా జగన్ కొత్త పథకాలను అమలు చేస్తున్నారు.

ఆర్థిక భారం పెరుగుతున్నా ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా జగన్ మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత అంటున్న జగన్ ప్రజల మెప్పు పొందుతుండటం గమనార్హం.