ఇళ్లకు స్మార్ట్ మీటర్లు.. జగన్ సర్కార్ కు ప్రజల నుంచి మరో షాక్ తప్పదా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ప్రజలకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా జగన్ సర్కార్ కొన్ని నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ఇళ్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. 2025 సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ మీటర్ల ఏర్పాటు జరగనుందని సమాచారం.

అయితే నెలకు 200 యూనిట్ల కంటే తక్కువగా విద్యుత్ ను వినియోగించే వాళ్లను మాత్రం ఈ పథకం నుంచి మినహాయించడం గమనార్హం. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, నిర్వహణకు ప్రభుత్వానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు కానుందని సమాచారం. ఏపీలో ప్రభుత్వ నిర్ణయం ద్వారా కోటిన్నర ఇళ్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతి నెలా రీడింగ్ ను నమోదు చేయాల్సిన అవసరం అయితే ఉండదు.

అయితే జగన్ సర్కార్ అమలు చేసే ఈ నిర్ణయం వల్ల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం తప్పనిసరిగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించలేదనే సంగతి తెలిసిందే. మరి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల దిశగా ఎందుకు అడుగులు వేస్తోందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ద్వారా ప్రజలకు కొత్త అనుమానాలు కలిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల ప్రజలు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం తలనొప్పి వ్యవహారంగా చాలామంది భావిస్తారు. జగన్ సర్కార్ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయాల విషయంలో ముందడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.