ఎన్నికల ముందు వాలంటీర్లకు వేతనం పెరుగుతుందా.. జగన్ సర్కార్ ప్లాన్ ఇదేనా?

ఏపీ సీఎం వైఎస్ జగన్ వాలంటీర్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ముందు వాలంటీర్లకు వేతనం పెరిగే ఛాన్స్ ఉందని సమాచారం. వాలంటీర్లకు 8,000 లేదా 10,000 రూపాయల స్థాయిలో వేతనం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తోంది. వేతనం పెంచడం ద్వారా వాలంటీర్లకు కచ్చితంగా బెనిఫిట్ కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.

జగన్ సర్కార్ ఈ విషయంలో తెలివిగా అడుగులు వేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ సర్కార్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయని జగన్ సర్కార్ భావిస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

టీడీపీ జనసేన పొత్తు ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తు ఉన్నంత వరకు వైసీపీకి ఇబ్బందేనని ఈ పార్టీల పొత్తు కుదరకపోతే మాత్రం వైసీపీ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని బోగట్టా. పొత్తులను బట్టి ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుందో కాదో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

వైసీపీ సైతం పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోకూడదనే విధంగా విమర్శలు చేస్తుండటం గమనార్హం. మరోవైపు వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని తెలుస్తోంది. వైసీపీ నేతల నుంచి ఇందుకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.