టీచర్ల విషయంలో జగన్ సర్కార్ పగబట్టిందా.. జీతాలు ఇవ్వట్లేదంటూ?

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసే వాళ్ల ఖాతాలలో సకాలంలో వేతనాలు క్రెడిట్ అవుతాయనే సంగతి తెలిసిందే. టీచర్లకు సమాజంలో ఉండే గౌరవం అంతాఇంతా కాదు. అయితే టీచర్లకు చెల్లించే వేతనం విషయంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీచర్లకు మాత్రం ఆలస్యంగా వేతనాలు చెల్లిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీచర్లకు 20వ తేదీ వచ్చినా వేతనాలు క్రెడిట్ కావడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

టీచర్ల విషయంలో జగన్ సర్కార్ పగబట్టిందని అభిప్రాయాలు వినిపిస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ ఇతర పథకాల అమలుపై పెడుతున్న శ్రద్ధ టీచర్లకు చెల్లించే వేతనం విషయంలో చూపించడం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ టీచర్లలో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే దిశగా అడుగులు వేస్తోందని మరి కొందరు వెల్లడిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

సకాలంలో జీతాలు క్రెడిట్ కాకపోతే ఉద్యోగులు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సీఎం జగన్ కు కూడా ఈ సమస్యలు తెలుసు. ఈ సమస్యల వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి జగన్ కు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. జగన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావాలంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు అవసరం అనే సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై టీచర్లు పగబడితే ఎన్నికల ఫలితాలపై ఆ ప్రభావం పడుతుంది.

ఇతర పార్టీలు ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తుండగా జగన్ సర్కార్ మాత్రం భిన్నంగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. 30 సంవత్సరాలు అధికారంలో ఉండాలని భావిస్తున్న జగన్ అందుకు భిన్నంగా అడుగులు వేస్తుండటం గమనార్హం.