ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ భారాన్ని తగ్గించుకునే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. వేల సంఖ్యలో కుటుంబాలను ప్రభుత్వం అనర్హులుగా ప్రకటిస్తుండటం గమనార్హం.
జగన్ సర్కార్ కొంతమందికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం చర్చనీయాంశమవుతోంది. ఆదాయం ఎక్కువగా ఉందనే కారణం చూపుతూ జగన్ సర్కార్ ఈ దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వం వీళ్లను ఉచిత విద్యుత్ కు అనర్హులు అని పేర్కొనడంతో పాటు పాత బకాయిలను కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాము నిరుపేదలం అయినా తమపై మోయలేని భారాన్ని మోపుతున్నారని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు లేకుండా విద్యుత్ కనెక్షన్లను తొలగించారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. రాత్రికి రాత్రి వచ్చి కరెంట్ ను నిలిపివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరి కొందరు చెబుతున్నారు. పాత బకాయిలన్నీ ఇప్పుడు కట్టాలని చెబితే ఎలా కడతామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ, వార్డ్ సచివాలయాల సర్వేల ప్రకారమే లబ్ధిదారులకు విద్యుత్ అందనుందని తెలుస్తోంది. అధికారులు మాత్రం రాయితీ విద్యుత్ వినియోగదారులలో అనర్హులను మాత్రమే తొలగిస్తామని చెబుతున్నారు. జగన్ సర్కార్ తాజా నిర్ణయం విషయంలో కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.