సర్పంచ్ ల పరువు తీస్తున్న జగన్ సర్కార్.. పదవి ఉన్నా లాభం లేదంటూ?

ఏపీలో ఉన్న సర్పంచ్ లకు పదవులు ఉన్నా ఆ పదవుల ద్వారా కలుగుతున్న ప్రయోజనం శూన్యం అని కామెంట్లు వినిపిస్తున్నాయి. పంచాయితీల ఆదాయంను ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు కేటాయిస్తూ ఉండటంతో పదవులు ఉన్నా తాము ప్రజలకు ఏం చేయలేకపోతున్నామని సర్పంచ్ లు బాధ పడుతున్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు తమ బాధను చెప్పుకున్నా ప్రయోజనం దక్కడం లేదని వాళ్లు చెబుతున్నారు.

ప్రభుత్వం తమకు పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కడానికి సర్పంచ్ లు సిద్ధమయ్యారని తెలుస్తోంది. జగన్ పాలనలో పంచాయితీలు నిర్వీర్యం అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పదవి ఉన్నా లాభం లేదని సర్పంచ్ లు భావిస్తున్నారు. తాము ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు సైతం తమకు అందకపోవడంతో పాటు తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఖర్చు చేస్తుండటం జగన్ సర్కార్ పరువు పోవడానికి కారణమైంది. పంచాయితీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వైసీపీ చెబుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగానే అర్థమవుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సొంత పార్టీ నేతలే వైసీపీకి షాకులివ్వడానికి సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. సర్పంచ్ ల ఆవేదన గురించి వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. సొంత పార్టీ నేతలకు ఇబ్బంది కలిగే విధంగా వైసీపీ వ్యవహరించడం సరికాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.