తప్పు మీద తప్పు చేస్తున్న జగన్ సర్కార్.. ప్రజాగ్రహానికి గురి కాక తప్పదా?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ 90 శాతం ప్రజలకు మంచి జరిగేలా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పథకాల అమలు విషయంలో జగన్ సర్కార్ పై ప్రజల్లో కూడా మంచి అభిప్రాయం ఉంది. అయితే జగన్ సర్కార్ తప్పు మీద తప్పు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు సామాన్య ప్రజలు హర్షించే విధంగా అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ఇప్పటం అనే గ్రామంలో 53 ఇళ్లు, ప్రహరీలను వైసీపీ కూల్చటం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రహదారి విస్తరణ పేరుతో జగన్ సర్కార్ అమలు చేసిన ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కక్ష సాధింపుతోనే జగన్ సర్కార్ ఈ విధంగా వ్యవహరిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రహదారి విస్తరణ కోసం నెలరోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు.

జనసేన, టీడీపీ కార్యకర్తల ఇళ్లనే జగన్ సర్కార్ కూల్చివేసిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్సు కూడా తిరగని ఊరిలో రహదారి విస్తరణ ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ గ్రామాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారని ఆ కారణం వల్లే వైసీపీ నేతలు ఇప్పటం గ్రామాన్ని టార్గెట్ చేశారని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

రోడ్ల విస్తరణ పేరుతో జగన్ సర్కార్ ఇళ్లను కూల్చడం ఏంటని కామెంట్లు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా జగన్ సర్కార్ ఈ విధంగా చెయ్యడం ఏంటని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకున్నా కూల్చేశారంటూ గ్రామస్తులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఇళ్ల కూల్చివేతపై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ప్రజాగ్రహం జగన్ పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు.