ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగింది. రెండో విడతలో 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 3,328 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నోటిఫై చేయగా.. 539 ఏకగ్రీవం కావడంతో మిగిలిన 2,786 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. సర్పంచ్ స్థానాల కోసం 7,510 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. రెండో విడతలో 33,570 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 12,605 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 20,796 వార్డుల్లో 13న ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి 44,879 మంది అభ్యర్థులు పడ్డారు.
రెండో దశలో ఏపీలో ఏకగ్రీవాల జోరు కొనసాగింది. టీడీపీ అదినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో.. ఆ పార్టీ అడ్రసే లేకుండా పోయింది. ముఖ్యంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో రెండు పంచాయతీలు మినహా అన్నీ ఏకగ్రీవమయ్యాయి. పెద్దిరెడ్డి స్వస్థలం సదుంలో 18 పంచాయతీలు, 172 వార్డులను ఏకగ్రీవమయ్యాయి. పుంగనూరు మండలంలో 23, చౌడేపల్లి మండలంలో 17 ఏకగ్రీవమయ్యాయి. పుంగనూర్ నియోజకవర్గంలో మొత్తం 80 పంచాయతీలు ఉండగా.. అందులో 80 గ్రామాలకు ఎన్నికలు లేకుండా సర్పంచ్ లు ఎన్నికయ్యారు.
దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో .. మాజీ చిత్తయ్యారనే చర్చ చిత్తూరు జిల్లాలో సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఆయనకే వర్తిస్తాయని అన్నారు. ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.ఇప్పటివరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను వైసీపీ సాధించిందని వెల్లడించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ఇంటి వద్దకే పథకాలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఛరిష్మా ముందు చంద్రబాబు నిలవలేకపోతున్నారని, చంద్రబాబుకు జగన్ ఫోబియా పట్టుకుందని వ్యాఖ్యానించారు.