2024లో జగన్ పార్టీదే అధికారం.. ఆ ఎన్నికల సీన్ రిపీట్ కాబోతుందా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించే వరకు జగన్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరనే సంగతి తెలిసిందే. వైఎస్సార్ మరణం అనంతరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ మాత్రం వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు. 2014లోనే వైసీపీ అధికారంలోకి రావాల్సి ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం జగన్ కు మైనస్ అయింది. అయితే సరైన ప్లానింగ్, మేనిఫెస్టోతో జగన్ ప్రజల ముందుకు వచ్చి వైసీపీ 2019లో ఊహించని స్థాయిలో విజయం సాధించడానికి కారణమయ్యారు.

2019 ఎన్నికల తర్వాత జగన్ పాలన విషయంలో 60 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉంటే 40 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. జగన్ రాజధానిని ఎంపిక చేసి అభివృద్ధి చేయడంతో పాటు రోడ్లు, కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే మాత్రం పరిస్థితులు మారే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మిగిలిన 40 శాతం ప్రజల మనస్సు కూడా జగన్ గెలుచుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

రాబోయే 18 నెలల్లో జగన్ ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. జగన్ ఈ పనులు చేస్తే మాత్రం జగన్ పై ప్రజల్లో పాజిటివిటీ పెరిగే అవకాశం అయితే ఉంది. 2009 ఎన్నికల సీన్ మళ్లీ రిపీట్ కానుందంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల కాంగెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్ అమలు చేసిన పథకాల వల్ల 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ అమలు చేసిన పథకాలను తర్వాత రోజుల్లో ఇతర పార్టీలు సైతం అమలు చేశాయి. జగన్ ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మించి పథకాలను అమలు చేస్తున్నారు. అందువల్ల 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంలో ఎలాంటి సందేహం అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.