జగన్ కు ఆ ఆలోచనలు లేవా.. జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టం లేదా?

ఏపీ సీఎం సీఎం వైఎస్ జగన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని చాలామంది ప్రజల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం కారణాలు తెలియకపోయినా జాతీయ రాజకీయాలు అంటే దూరంగా ఉన్నారు. మోదీకి శత్రువు కావడం జగన్ కు అస్సలు ఇష్టం కాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ రాజకీయాల్లో వేలు పెడితే మొదటికే మోసం వస్తుందని పార్టీకి కొత్త సమస్యలు వస్తాయని జగన్ భావిస్తున్నారు. ఏపీలో మరో 30 సంవత్సరాల పాటు తానే సీఎం అని భావిస్తున్న జగన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడం సులువు కాదని జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే తన పొలిటికల్ కెరీర్ కు ప్రమాదం ఏర్పడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో కూడా జగన్ జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండనున్నారు.

అయితే వైసీపీ మద్దతు మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీకి జగన్ కు మధ్య గ్యాప్ ఉందనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా జగన్ కు నష్టమే తప్ప లాభం ఉండదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితీకి జగన్ కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే కేసీఆర్ మాత్రం జగన్ మద్దతు కోరుకుంటున్నారు. జగన్ మద్దతు ఉంటే వైసీపీకి కచ్చితంగా ప్లస్ అవుతుందని అదే సమయంలో బీ.ఆర్.ఎస్ కు కూడా మేలు జరుగుతోందని కేసీఆర్ చెబుతున్నట్టు తెలుస్తోంది. జగన్ కు జాతీయ రాజకీయాలపై ఆలోచన లేదని తెలిసి ఆయన అభిమానులు షాకవుతున్నారు.