2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు సాధారణ ఇబ్బందులు కానే కాదు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయంలో ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు చెత్త పాలన వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఫలితాలు వచ్చాయి. చంద్రబాబుపై ఏ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందో ఆ ఎన్నికల ఫలితాలే ప్రూవ్ చేశాయి.
అయితే ఏపీలో గెలుపు కోసం వైసీపీ ఒకవైపు ఉంటే మిగతా పార్టీలు మరోవైపు ఉండనున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం తప్పు చేసినా 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరమయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2014 పరిస్థితులే 2024లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.
జగన్ వైసీపీ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది. ఉద్యోగుల్లో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించే దిశగా కూడా అడుగులు వేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ ఏ చిన్న తప్పు చేసినా ఐదేళ్లు అధికారానికి దూరం కావాల్సి ఉంటుంది.
2024 ఎన్నికల్లో కూడా వైసీపీని అధికారంలోకి తెస్తే జగన్ కు మరో 30 ఏళ్లు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వాలంటీర్లకు బెనిఫిట్ కలిగే విధంగా జగన్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలను బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో డిసైడ్ కానుంది.