2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం సులువు కాదు. పేద ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న పథకాల వల్ల సంతృప్తితో ఉన్నప్పటికీ మధ్యతరగతి వర్గాల ప్రజలు, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు మాత్రం సంతృప్తితో లేరు. ప్రభుత్వ ఉద్యోగులు జగన్ సర్కార్ పేరు చెబితే మండిపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల తాము తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
16 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ గెలవాలంటే జగన్ తప్పనిసరిగా పార్టీకి ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నవాళ్లలో ఆ అసంతృప్తిని తగ్గించే విధంగా జగన్ సర్కార్ అడుగులు వేస్తే బాగుంటుందని మరి కొందరు చేస్తున్న కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఒక్క పని చేస్తే మాత్రం జగన్ సర్కార్ కు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో అవినీతి లేకుండా జగన్ సర్కార్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కొన్నిచోట్ల మాత్రం ఈ అవినీతి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారుల అవినీతి వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఈ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ గతంలో జరిగిన తప్పులు రాబోయే రోజుల్లో జరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే పార్టీకి తిరుగుండదని జగన్ సైతం భావిస్తున్నారు. పార్టీపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో జగన్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఉతరాంధ్ర, గోదావరి జిల్లాలపై జగన్ ప్రధానంగా దృష్టి పెట్టాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ 2024 ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తారో చూడాల్సి ఉంది.