బ్యాలెన్స్ చెయ్యాలి జగన్.. విమర్శించే అవకాశం ఇస్తే పొరపాటు చేసినట్టే?

YS Jagan

ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చెయ్యడంలో ఫెయిల్ అవుతున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు జమ కావడం లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో సులువుగా క్లారిటీ వస్తుంది. మరీ ఎక్కువ సంఖ్యలో పథకాలను అమలు చేయడం వల్ల ఏపీ సర్కార్ డబ్బును పప్పూ బెల్లాల్లా పంచుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర ఆదాయంలో సగం డబ్బులు సంక్షేమం కోసం మిగిలిన డబ్బులను వేతనాలు, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పులాంధ్రప్రదేశ్ అంటూ కొంతమంది జగన్ సర్కార్ పై చేస్తున్న కామెంట్లను సైతం జగన్ గమనించాల్సి ఉంది. ఆర్థిక మంత్రి బుగ్గన సమస్యలను పరిష్కరించడం కోసం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు.

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వేతనాల విషయంలో వ్యతిరేకత వస్తున్నా వాళ్లు అడిగే ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వలేని పరిస్థితిలో జగన్ సర్కార్ ఉంది. జగన్ సర్కార్ చేస్తున్న చిన్నచిన్న పొరపాట్లే ప్రతిపక్షాలకు ప్లస్ అవుతున్నాయి. బ్యాలెన్స్ చేసే విషయంలో ఫెయిలైతే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని చెప్పవచ్చు.

జగన్ ఏం చేసినా సామాన్య, మధ్యతరగతి వర్గాలతో పాటు మిగతా వర్గాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుకెళితే బాగుంటుందని చెప్పవచ్చు. అలా కాకుండా ఇవే పొరపాట్లను రిపీట్ చేస్తూ జగన్ ముందుకెళితే మాత్రం ఆ నష్టం మామూలుగా ఉండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.