కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఆలోచనలో జగన్ సర్కారు!దానికి మోడీనే ముహుర్తం పెట్టుకున్నారే!

jagan is planning to fight for state issues

దేశంలో లాక్డౌన్ ఎత్తివేశాక ఇప్పుడిప్పుడే అన్ని కార్య కలాపాలు తిరిగి మొదలవటంతో కుంటుపడిన అభివృద్ధిని పరిగెత్తించేందుకు గాను మరియు కరోనా పరిస్థితులపై చర్చించటాని అంతరాష్ట్ర సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధం అవుతుంది. ఈ సమావేశం ఎప్పటిలానే వర్చ్యువల్ గా చేపట్టనున్నారు. ఇదే అదునుగా ఈ అవకాశాన్ని ఎపి సమస్యలపై వినియోగించుకోవాలని జగన్ సర్కార్ వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం నిధులపై కేంద్ర ఆర్ధిక శాఖ ఆడుతున్న నాటకాలను అందరి ముందు ప్రస్తావించి మోడీ సర్కార్ ను ఇరకాటంలో పెట్టాలని వైసిపి ప్రభుత్వం భావిస్తుందని అంటున్నారు. పోలవరంపై ఇంటా బయటా విమర్శలను ఎదుర్కొంటున్న జగన్ దీన్ని అవకాశంగా మలుచుకోవాలని లెక్కలన్నీ స్టడీ చేస్తున్నారని అంటున్నారు.

jagan is planning to fight for state issues
Ys jagan mohan reddy

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలోనే ఏపీకి ఝలక్ ఇచ్చేసింది. అది ముగిసిన అధ్యాయంగా తేల్చేసింది. పార్లమెంట్ లో చట్టం చేయనందున చేసేదేమీ లేదని చెబుతూ వస్తుంది. అయితే విపక్షంలో ఉన్నప్పుడు హోదా కోసం పోరాటం గట్టిగా చేసిన జగన్ సర్కార్ 30 మంది వరకు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఉన్నా పార్లమెంట్ లో ఏడాదిన్నరగా పోరాడింది పెద్దగా ఏమి లేదు.

మోడీ సర్కార్ కి కేంద్రం లో పూర్తి బలం ఉండటంతో ఉద్యమ బాట ను వైసిపి ఎంచుకోలేదు. ఇదే ఆ పార్టీని విమర్శలు, ఆరోపణలకు గురయ్యేలా చేస్తుంది. దాంతో అంతరాష్ట్ర సమావేశంలో ఈ అంశం పై కూడా జగన్ గళం వినిపించాలని భావిస్తున్నారని తెలిసింది. దీనికోసం ప్రత్యేక అనుమతి కోరి రాష్ట్ర ప్రయోజనాల అంశంలో తమ పార్టీ రాజీ పడబోదని స్పష్టం చేయాలన్నది జగన్ ఆలోచన గా ఉంది. అయితే మోడీ ఈ మొర ఆలకిస్తారా లేక రాజకీయ ప్రయోజనాలకే మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి.