ఏపీ సీఎం వైఎస్ జగన్ నమ్మినవాళ్లకు ఎంతో విలువ ఇస్తారు. ఎవరైతే పని బాగా చేస్తారో వాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడి తనను మోసం చేసిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేశారు. నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ దెబ్బ అదుర్స్ కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ప్రభుత్వ సలహాదారు వెల్లడించిన వివరాల ప్రకారం ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు వైసీపీ షాకిచ్చింది. వైసీపీ క్రమశిక్షణ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు పని చేసినా షాక్ తప్పదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలకు వైసీపీ షాకిచ్చింది. భవిష్యత్తులో సైతం తప్పు చేస్తే ఇదే విధంగా జగన్ వ్యవహరించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తుండగా డబ్బులు చేతులు మారిందని వైసీపీ చెబుతుండటం గమనార్హం. ఆ డబ్బులు ఎంత మొత్తం అనే వివరాలు తెలియాల్సి ఉంది.
చంద్రబాబు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఆఫర్ చేశారని వైసీపీ చెబుతుండటం గమనార్హం. అంతర్గత విచారణ తర్వాత వైసీపీ ఈ దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో వైసీపీ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.